కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం జగన్ సర్కార్ కు కంటిమీద కినుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన మంత్రి కొడాలి నానిపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవర్నర్ కు లేఖ రాశారు.

తనపై అసభ్య పదజాలమే కాకుండా ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి కొడాలి నాని నిన్న ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్లింగులు, వీడియోలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు పంపిన లేఖతోపాటు పంపించారు.