గ్రేటర్ లో నామినేషన్ల జాతర

గ్రేటర్ ఎన్నికలకి రేపే నామినేషన్ దాఖలుకి చివరి తేది. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటుగా మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి అనుమతి ఉంటుంది.

ఈరోజు, రేపు పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నవంబర్ 21 వ తేదీన నామినేషన్ల పరిశీలనా, 22 న ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 1 వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉండగా, డిసెంబర్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.