డేంజర్ లో గ్రేటర్ ప్రజలు

గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడిప్పుడు వరదలు తగ్గాయి. నీట మునిగిన కాలనీలు కోలుకుంటున్నాయి. మరోవైపు వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబల్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వరద ప్రాంతాల్లో నీరు కలుషితమైనందున అంటు వ్యాదుల ముప్పు భయపెడుతోంది. అసలే కరోనా విజృంభిస్తున్న కాలం. ఇలాంటి సమయంలో పరిశుభ్రంగా ఉండతం అత్యంత కీలకం.

అయితే భారీ వర్షాలతో అంటు వ్యాధులు విజృంభించనున్నాయని తెలుస్తొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అంటు వ్యాదుల ముప్పు రాకుండా ఉండడానికి 60 వైద్య క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మురుగు నీటిలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడానికి అప్రమత్తం చేసారు. ఇప్పటికే చాల ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది తమ తమ విధుల్లో నిమగ్నమయ్యారు. వరద ప్రాంతాల్లో అంటు వ్యాదులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, దోమలు అధికంగా వ్యాప్తించకుండా నివారించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.