గ్రీన్‌రాఖీలు.. భలేగున్నాయే.. !  

రాఖీపౌర్ణమి సందర్భంగా సరికొత్త డిజైన్ల రాఖీలతో కళకళలాడే మార్కెట్లు కరోనా కారణంగా వెలవెలబోతున్నాయి. అయితే ఒడిశాలో లభిస్తున్న హరితరాఖీలు ఆ లోటును కొంతవరకు తీరుస్తున్నాయి. మయూర్భంజ్‌ జిల్లాలో లభించే ‘సబై’ అనే ప్రత్యేకమైన గడ్డిపోచలతో వీటిని తయారు చేస్తున్నారు.

గత ఐదేళ్లుగా స్థానిక మహిళలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ హరితరాఖీలను తయారుచేసి విక్రయిస్తున్నారు. వివిధ రంగులు, డిజైన్లలో పూర్తి పర్యావరణహితంగా తయారు చేయడం వీటి ప్రత్యేకత. గ్రీన్‌రాఖీలుగా పిలిచే వీటికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది.