డిజిటల్ క్లాసులకు గైడ్ లైన్స్ విడుదల

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ క్లాసులకి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది.  మరోవైపు ఆన్ లైన్ క్లాసులు, ప్రయివేటు స్కూల్స్ లో ఫీజులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఆన్ లైన్ తరగతులు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఆన్ లైన్ తరగతులపై విధి విధానాలు ఖరారు చేసినట్లు హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. టీ శాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీవీ పాఠాల్లో విద్యార్థులకు అనుమానాలు వస్తే ఎలా నివృత్తి చేసుకుంటారని హైకోర్టు అడగగా… సందేహాలు నివృత్తి చేసేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది