హాత్ వే రాజశేఖర్ కన్నుమూత


కేబుల్ టీవీ రంగ ప్రముఖుడిగా, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతిగా వ్యవహరించిన రాజశేఖర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు ఉదయం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. కంపెనీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న రాజశేఖర్ ఒకప్పుడు కేబుల్ టీవీల కాలంలో చక్రం తిప్పాడు.

ఎంఎస్ఓ అధ్యక్షుడిగా ఏపీ, తెలంగాణ కేబుల్ ఆపరేటర్లను తన గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రచారం జరిగింది. హాత్వే యాజమాన్యంతో మనస్పర్ధలు వచ్చి రెండెళ్ల క్రితం రాజశేఖర్ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఎగ్జయిటైల్ అనే కంపెనీలో చేరారు.