మిమిక్రీ హరికిషన్ ఇక లేరు


టాలీవుడ్‌లో విషాదం. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. హరికిషన్‌ మే 30, 1963లో ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు.

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు ఎంతో మంది సినీ నటుల గొంతులను ఆయన అనుకరించేవారు. సినీనటులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌, వీహెచ్‌ తదితర నేతలను హరికిషన్‌ అనుకరించి అలరించేవారు. పలు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించారు.