పోలీస్ తీరు ఫై హరీష్ ఫైర్..

మంత్రి హరీష్ రావు పోలీస్ తీరు ఫై మండిపడ్డారు. సంగారెడ్డిలో సమీక్ష ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న హరీశ్ రావు… మధ్యలో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున జనం ఉండడం చేసి.. వెంటనే కాన్వాయ్‌ దిగి అక్కడికి వెళ్లారు. వారంతా విద్యార్థులని… సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి కోసం వచ్చారని పోలీసులు చెప్పడం తో వారిని ఇంత సేపు ఇలా ఒక్క చోట ఉండటం ఏంటని… త్వరగా అందరికీ అనుమతి ఇప్పించి పంపాలని ఆదేశించారు. దీంతో పోలీస్ లు వారికీ అనుమతి ఇచ్చి పంపించారు.

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని అన్ని హాస్టల్స్ ను ఖాళీ చేయిస్తున్నారు. నగరంలోని పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లోని హాస్టల్స్‌ నిర్వాహకులు విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఎటూ దిక్కుతోచని విద్యార్థులు ఆయా ప్రాంతాల్లోని స్థానిక పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకొని సొంతర్లకు వెళ్తున్నారు.