భారీ వర్షాలు : హరీష్ రావు రిక్వెస్ట్

భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయ్. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలోప్రజలకు మంత్రి హరీష్ రావు ఓ విజ్ఝప్తి చేశారు. రోడ్లు, నాలాలు కబ్జా చేసి ఇళ్లు కట్టవద్దని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలో నాల్సాబ్‌గడ్డ, నారాయణరెడ్డిలో ముంపు ప్రాంతాలను మంత్రి హరీశ్‌రావు ఈరోజు పరిశీలించారు.

వరద నీటి కాలువలను అడ్డుకోవడం వల్లే ఇలాంటి కష్టాలు వస్తాయి. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న విపరీతమైన వర్షాల వల్ల ఈ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడం, ఇళ్లులు కూలడం జరిగింది. ఇళ్లులు కూలిన వారికి తక్షణ సాయం కింద ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అందించాం. నాల్సాబ్‌గడ్డలో మురుగు నీరు ప్రవహించే కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేయడానికి అధికారులకు ఆదేశాలిచ్చాం. ఇందు కోసం కోటి యాబై లక్షల రూపాయలను మంజూరు చేశాం. నాలాలను ఆక్రమించి జరిగిన నిర్మాణాలను వెంటనే తొలగించాలి. నాలాలను తొలగించడం వల్ల నష్టపోయే ఇళ్ల యజమానులకు సంగారెడ్డిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మంత్రి అన్నారు.