‘గద్దలకొండ గణేష్’ కాంబోలో మరో సినిమా 

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్-పూజా హెగ్డే జంటగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో హరీష్ కి పేరు తెచ్చిన సినిమా ఇది. 14 రీల్స్ బ్యానర్ లో ఈ సినిమా వచ్చింది.  ఇప్పుడు 14 రీల్స్ మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే కథానాయకుడు ఎవరు ? అన్నది మాత్రం తెలపలేదు.

ఇక హరీష్ శంకర్ త్వరలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు హరీష్‌. ఈ సినిమా కోసం ఇప్పుడే మొదలైంది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయ్క్.