‘డబ్ల్యూహెచ్‌ఓ’లో కేంద్ర మంత్రికి కీలక పదవి 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ‘డబ్ల్యూహెచ్‌ఓ’లో కీలక పదవి దక్కింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. మే 22న బాధ్యతలు చేపట్టనున్నారు. 34 మంది సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం జపాన్‌కు చెందిన హిరోకి నకటాని ఉన్నారు.

హిరోకి పదవీకాలం ముగియడంతో హర్షవర్దన్‌ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. హర్షవర్ధన్‌ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. డబ్ల్యూహెచ్ఓ విధానపరమైన నిర్ణయాల్లో కార్యనిర్వాహక బోర్డు కీలక భూమిక పోషిస్తుంది. కాగా, డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌ పదవికి భారత్‌ను నామినేట్‌ చేస్తూ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య గతేడాదే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.