హాథ్రస్‌ కేసు.. షాకింగ్ న్యూస్ !

హాథ్రస్‌ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోనికి వచ్చింది. బాధితురాలి సోదరుడు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు. మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్‌ ఠాకూర్‌ అనే వ్యక్తితో గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో సుమారు 104 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఫోన్‌ సంభాషణల గురించి తనకేమీ తెలీదని.. తాను గానీ, తన కుటుంబంలో ఇంకెవరూ గానీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. సెప్టెంబర్‌ 14న యూపీలోని హాథ్రస్‌ గ్రామంలో ఓ దళిత యువతిపై దాడి జరగ్గా.. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అదే నెల 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు సహా పలువురు ఆరోపించారు. అయితే అటువంటిదేమీ జరగలేదని, మెడకు తగిలిన గాయం వల్లే ఆమె మరణించిందని పోలీసులు వాదిస్తున్నారు.