దాదాకు హార్ట్ ఎటాక్

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ ఎటాక్ తో కోల్ కతాలోని వుడ్ లాండ్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా.. గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఈ సాయంత్రం ఆయనకు సర్జరీ చేస్తారని సమాచారం.

ఇక ఇటీవల గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం మొదలైంది. ఆయన సోదరుడి కరోనా బారిపడి కోలుకున్నారు. ఇక ఇటీవల 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్న సంగతి తెలిసిందే. నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ 22 టెస్టుల్లో ఏ ఒక్కసారి కూడా తనకు పాజిటివ్‌గా రాలేదన్నారు. మరోవైపు..సౌరవ్ గంగూలీ.. రాజకీయాల్లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గంగూలీ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపించాయి.

Spread the love