హైదరాబాద్ భారీ వర్షం.. భారీగా ట్రాపిక్ జామ్ !

హైదారాబాద్ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్బీనగర్‌లో ఈ రోజు దాదాపు 7సెం.మీల మేర వర్షం కురిసింది. మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు నెమ్మదించాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, లంగర్‌హౌజ్‌, మెహదీపట్నం మీదుగా వాహనాలను దారిమళ్లిస్తున్నారు. పాతబస్తీలోని బాబానగర్‌లో భారీగా వరద నీరు పారుతోంది. బాలాపూర్‌ చెరువు నీళ్లతో వీధుల్నీ జలమయమయ్యాయి. గోల్నాక కొత్త వంతెనపై భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది.

ముసారాంబాగ్‌ వంతెనపై రాకపోకలు నిషేధించారు. గోల్నాక వంతెనపై నుంచి వాహనాల దారిమళ్లింపుతో అక్కడ రద్దీ పెరిగింది. శంషాబాద్‌, మల్కాజిగిరిలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉప్పల్‌లో వరంగల్‌ జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం ధాటికి ఫలక్‌నుమా ఓవర్‌ బ్రిడ్జిపై గుంత ఏర్పడింది. గతంలో వర్షానికి మూడు రోజుల పాటు ఈ వంతెన జలదిగ్బంధంలోనే ఉంది.