వైరల్ : రిషికేశ్ లో యువతి నగ్న వీడియో

అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఉత్తరప్రదేశ్‌లోని రిషికేశ్ ఒకటి. ఇక్కడా లక్ష్మణ్ ఝూలా వద్ద ఓ యువతి నగ్నంగా వీడియో షూట్ చేసింది. అంతటితో ఆగకుండా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన గజేంద్ర సాజ్వాన్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే స్పందించిన పోలీసులు.. సదరు ఫ్రెంచి యువతిని అరెస్టు చేశారు. ఎందుకిలా చేశావని ఆమెను ప్రశ్నించగా.. నగ్నంగా వీడియో తీయడం భారత్‌లో నేరమని తనకు తెలియదని చెప్పిందట. ఆ తర్వాత బెయిలుపై ఆమెను విడుదల చేశారు.