మరోసారి హైదరాబాద్ లాక్‌డౌన్

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. హైదారాబాద్‌లో కూడా 15 రోజులు లాక్‌డౌన్ విధించడం మంచిదని, వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయ్.. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల్ని సన్నద్ధం చేయాల్సి ఉంటుందని, 4 రోజుల్లో కేబినెట్‌ను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్‌లోని బేగం బజార్, సిద్ధి అంబర్ బజార్లలో హోల్ సేల్ వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపారవేళలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌ జనరల్ బజార్ పరిసర వ్యాపార ప్రాంతాలన్నిటిలోనూ పూర్తి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని వ్యాపారులే నిర్ణయించారు.