7 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభం

అన్ లాక్ 4లో భాగంగా ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాద్ మెట్రో పరుగులు తీయనుంది. రైళ్ల ఫ్రీక్వెన్సీ సుమారు 5 నిమిషాలు ఉంటుంది. ప్రయాణీకుల రద్దీ ఆధారంగా సర్వీసులను పెంచడం లేదా తగ్గించడం జరగనున్నట్లు తెలిపారు. కాగా కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లు గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ మూసే ఉంటాయన్నారు.

ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని లేదంటే జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించారు.

Spread the love