దేశంలో 63,371 కొత్త కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 63,371 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 895 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,161కి చేరింది.

నిన్న దేశ వ్యాప్తంగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 8,04,528 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది.దేశంలో రికవరీ రేటు  87.56 శాతంగా ఉంది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది.