24గంటల్లో 83వేల కొత్త కేసులు, 66వేల మంది రికవరీ

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండోరోజూ అత్యధికంగా 83వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకావడంలేదు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 39లక్షల 36వేలకు చేరింది.నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.

గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1096 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒకేరోజు వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఆగస్టు 19వ తేదీన నమోదైన 1092 మరణాలే ఇప్పటివరకు అత్యధికం. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 68,472కు చేరుకుంది.