దేశంలో అరకోటి కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 90,122 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,20,359కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 39,42,361 మంది కోలుకోగా.. 9,95,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

నిన్న ఒక్క రోజే 1,290 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 82,066కి పెరిగింది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 78.5శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 11,16,842 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 5,94,29,115 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 66లక్షలకు పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉంది.