దేశంలో 92,071 కొత్త కేసులు.. 1,136 మరణాలు !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,071 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,136 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో మరణాల సంఖ్య 79,722కి పెరిగింది.

ఇప్పటి వరకు 37,80,107 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 78 శాతానికి చేరింది. మరణాల రేటు 1.64 శాతంగా ఉంది.