దేశంలో 54,044 కొత్త కేసులు

దేశంలో గత 24 గంటల్లో దేశంలో 54,044 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 76,51,108కు చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 7,40,090 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 67,95,103 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 1,15,914 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న ఒక్కరోజే 717 మంది వైరస్‌ సోకి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 9.67 శాతంగా ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం రికవరీ రేటు 88.81శాతంగా ఉంది. మరణాలు రేటు 1.51 శాతానికి చేరింది. మంగళవారం కొత్తగా 10,83,608 నమూనాల్ని పరీక్షించారు.