రైళ్ళు కూడా షురూ అవుతున్నాయి


దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా రద్దు అయిన సాధారణ రైళ్లు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జూన్‌ 1 నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. త్వరలోనే రైళ్లకు సంబంధించిన సమయ పట్టికను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

అయితే ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని.. కౌంటర్ల ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వలస కార్మికుల కోసం నడిపే 200 శ్రామిక్‌ రైళ్లతోపాటు అదనంగా మరో 200 సాధారణ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది