మూడో టెస్టులో ఆసీస్ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్తోంది. 83 ఓవర్లకు జట్టు స్కోర్‌ను 274/5 కి తీసుకెళ్లారు. దీంతో ఆసీస్ ఆధిక్యం 360 పరుగులు దాటింది. అంతకుముందు స్టీవ్‌స్మిత్(81) అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ కామెరాన్ గ్రీన్(51) అర్ధశతకం సాధించాడు. బుమ్రా వేసిన 83వ ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాదిన అతడు టెస్టుల్లో తొలి అర్ధశతకం నమోదు చేశాడు.
మరోవైపు కెప్టెన్ టిమ్‌పైన్(34) చక్కగా సహకరిస్తున్నాడు. వీరిద్దరూ అర్ధశతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే 83 ఓవర్లకు జట్టు స్కోర్‌ను 274/5 కి తీసుకెళ్లారు. అర్ధశతకం సాధించిన స్టీవ్‌స్మిత్(81) నాలుగో రోజు భోజన విరామం తర్వాత ఔటయ్యాడు. జట్టు స్కోర్ 208 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇచ్చినా భారత్ రివ్యూకు వెళ్లడంతో స్మిత్ ఔటైనట్లు తేలింది.