భారత్-ఆసీస్ తొలి వన్డే రేపే

భారత్-ఆసీస్ ల మధ్య రేపటి నుంచి వన్ డే సిరీస్ ప్రారంభం కానుంది. రేపు ఆసీస్ తో భారత్ మొదటి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఆ కారణంగా ప్రస్తుతం భారత ఆటగాళ్ల పేర్లు ట్విట్టర్లో ట్రెండ్ లోకి వచ్చాయి. రేపు ఉదయం 9:10 గంటలకు భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది.

గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ స్థానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారు ? అన్నది ఆసక్తిగా మారింది. కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, మనిదీప్ సింగ్ పేర్లు వినిపిస్తున్నా… మనిదీప్ సింగ్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తొంది.

Spread the love