భారత్ తో సిరీస్ విండీస్ జట్టు ఇదే.. !

వన్డే, టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్ల భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ డిసెంబర్‌ 6న ఉప్పల్‌లో జరగనుంది. రెండో టీ20 డిసెంబర్‌ 8న తిరువనంతపురంలో, ఆఖరి టీ20 డిసెంబర్ 11న ముంబయిలో జరగనుంది. డిసెంబర్ 15న చెన్నై వేదికగా తొలి వన్డే, డిసెంబర్‌ 18న విశాఖపట్నంలో రెండో వన్డే, ఆఖరి వన్డే డిసెంబర్ 22న కటక్‌లో జరగనుంది. తాజాగా భారత్ సిరీస్ ల కోసం విండీస్ జట్లని ప్రకటించారు.

రెండు ఫార్మాట్లకు కీరన్‌ పొలార్డ్‌ నాయకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని భారత పర్యటనకు జట్టును ప్రకటించామని వెస్టిండీస్ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ తెలిపారు.

టీ20 జట్టు : కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్), ఫాబియన్‌ అలెన్‌, షెల్డన్‌ కాట్రెల్‌, హెట్‌మెయిర్‌, జేసన్ హోల్డర్‌, బ్రాండన్‌ కింగ్‌, ఎవిన్‌ లూయిస్, నికోలస్‌ పూరన్‌, కీమో పాల్‌, ఖరీ పియర్రీ, రామ్‌దిన్‌, రూథర్‌ఫర్డ్‌, సిమన్స్‌, హెడెన్‌ వాల్ష్‌, కెస్రిక్‌ విలియమ్స్

వన్డే జట్టు : కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), షాయ్‌ హోప్‌, సునిల్‌ అంబ్రిస్‌, రోస్టన్‌ ఛేజ్‌, షెల్డన్‌ కాట్రెల్, హెట్‌మెయిర్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, ఎవిన్‌ లూయిస్‌, కీమో పాల్, ఖరీ పియర్రీ, నికోలస్‌ పూరన్‌, షెఫెర్డ్‌, హోల్డర్‌, హేడెన్‌ వాల్ష్‌.