ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా క్రెడ్‌

ఐపీఎల్‌-2020 అధికారిక భాగస్వామిగా బెంగళూరుకు చెందిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ క్రెడ్‌ ఎంపికైంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌ అఫీషియల్ పార్ట్‌నర్‌గా ఎంపికైన రెండో కంపెనీ క్రెడ్‌ కావడం విశేషం.

ఐపీఎల్‌ మూడు సీజన్లకు అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన ఎడ్యూ-టెక్‌ సంస్థ ‘అన్అకాడమీ’ వ్యవహరిస్తుందని గతవారం బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్‌ కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన ‘అన్అకాడమీ’ మూడేళ్లకు గానూ సుమారు రూ.130 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.