ఐశ్వర్యారాయ్ త్వరగా కోలుకోవాలని స్టార్ రెజ్లర్ ప్రార్థనలు

బిగ్ బీ అమితాబ్ కుటుంబం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే అమితాబ్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు, కొంతమంది సినీ ప్రముఖులు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ జాబితాలో డబ్ల్యూడబ్యూఈ రెజ్లర్‌ జాన్‌సినా కూడా చేరారు.

ఐశ్వర్యారాయ్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేసారు. అలాగే.. ఇటీవలే కన్నుమూసిన పలువురు బాలీవుడ్ స్టార్‌ల ఫోటోలను కూడా జాన్‌సినా పోస్టుచేశాడు. తాజాగా మరణించిన ప్రముఖ నటులు రిషీ కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఇన్‌స్ట్రాలో షేర్ చేసి సంతాపం ప్రకటించారు.