కేంద్రం నిర్ణయంపై ఇస్రో చైర్మెన్ హర్షం

భారత అంతరిక్ష రంగంలో ప్రవైటు సంస్థలకు అనుమతిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చీఫ్ కే. శివన్ స్వాగతించారు. ఈ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

‘అంతరిక్ష రంగంలో ప్రభుత్వం ఎన్నో స్ఫూర్తి వంతమైన సంస్కరణలు తీసుకొచ్చింది. వీటి ద్వారా ఒనగూడే ప్రయోజనాలతో యువత లబ్ధి పొందుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటికే ఎన్నో స్టార్ట్‌ అప్ కంపెనీలు అంతరిక్ష రంగంలోకి ప్రవేశించేందుకు ముందుకు వచ్చాయి. ఈ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని భావిస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.