శశికళకు ఐటీ షాక్

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఐటీశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. రూ.2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామీ నిషేధిత చట్టం ప్రకారం అటాచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. కొడనాడ్‌, సిరతవూర్‌లో శశికళ, ఇళవరసి, సుధాకరణ్‌ పేరిట ఉన్న ఆస్తులను సీజ్‌ చేశారు. ఆయా ప్రాంతాల్లో బయట ఐటీ శాఖ అధికారులు నోటీసులు అంటించారు.

”మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన ఆస్తులను ఈ రోజు ఐటీ శాఖ అటాచ్‌ చేసింది. తమిళనాడులోని కొడనాడు, సిరతవూర్‌లలోని రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది” అని నోటీసుల్లో పేర్కొంది