కేసీఆర్-జగన్ ఏం చర్చించారంటే ?

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ల సమావేశం ముగిసింది. దాదాపు 6గంటల పాటు సమావేశం కొనసాగింది. విభజన అంశాలు, తాజా రాజకీయాలపైనే ఇద్దరు సీఎంలు ప్రధానంగా చర్చించారు. అన్ని అంశాల్లో ఇచచిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని సీఎంలు నిర్ణయించారు. 9, 10వ షెడ్యూల్‌ అంశాలు వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

సమావేశం నుంచే ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేసీఆర్‌, జగన్‌ మాట్లాడారు. విభజన అంశాలను పరిష్కరించే దిశగా త్వరలో సమావేశం కావాలని ఆదేశించారు. పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. గోదావరి జలాలను తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా కృష్ణా ఆయకట్టుకు తరలించొచ్చని సీఎంలు పేర్కొన్నారు. అంతేకాదు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.