జగన్-కేటీఆర్ సేమ్ టు సేమ్

సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన సంగతి తెలిసిందే. విభజన సమస్యలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు ఎప్పటిలాగే.. ఏపీ సీఎం జగన్ ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సీఎం జగన్ ని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్, కేటీఆర్ ఒకే స్టయిల్ డ్రెస్సింగ్ లో కనిపించడం విశేషం.

సీఎం జగన్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా దుస్తులు ధరించి పక్కపక్కనే నడుస్తుండగా కెమెరాలు ఒక్కసారిగా క్లిక్ మన్నాయి. ఒకే రంగు షర్టు, ఒకే రంగు ప్యాంటు ధరించిన వీరిరువురు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. జగన్, కేటీఆర్ కి ఒక్కటే తేడా కేటీఆర్ షూస్ వేసుకొన్నారు. సీఎం జగన్ చెప్పులు వేసుకొన్నారు. మిగితాదంతా సేమ్ టు సేమ్. అంతేకాదు ప్రగతిభవన్ కు వచ్చిన జగన్ ను అక్కడే ఉన్న కేటీఆర్ తనయుడు హిమాన్షు విష్ చేయడమే కాకుండా కరచాలనం కూడా చేశారు.