రియాల్టీ షో కు హోస్ట్ గా ఫ్యామిలీ హీరో..

ఫ్యామిలీ హీరోగా యావత్ ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు..ప్రస్తుతం విలన్ గా క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని భాషల్లో రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు హోస్ట్ గా మారబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బుల్లితెరపై హోస్ట్‌లుగా నాగార్జున‌, మెగాస్టార్ చిరంజీవి , జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాని, ఆర్‌కే రోజా త‌దిత‌రులు రాణించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లో జగపతి బాబు కూడా చేరబోతున్నాడు.

జెమినీ టీవీలో ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఆయ‌న అంగీకరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన హోస్ట్ గా రియాలిటీ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని బుల్లితెర ప్రేక్షకులలో కొంత ఆసక్తి నెలకొంది.