నాగశౌర్య సినిమాలో జగ్గూభాయ్ కీలక పాత్ర

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విలువీరుడిగా కనిపించనున్నారు. ఇందుకోసం ఏకంగా 8పలకల దేహాన్ని రెడీ చేశారు. ఈ చిత్రంలో జగపతి కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారమ్.

ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరు 18 నుంచి జరగనుంది. ఈ చిత్రానికి నారాయణదాస్ నారంగ్, శరత్ మరార్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.