ఈటెల డమ్మీ.. జగ్గారెడ్డి మళ్లీ అదే మాట !

మంత్రి ఈటెల డమ్మీ అని, ఆయన కరోనా బులిటెన్ చదవడానికే పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి జగ్గారెడ్డి ఈటెలని టార్గెట్ చేశారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు. కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందన్నారు జగ్గారెడ్డి. ఆరోగ్య శాఖ మాత్రమే ఈటల దగ్గర ఉంది.. పవర్ అంతా సీఎం దగ్గరే ఉందన్నారు.

ఈటల కేవలం కరోనా కేసుల బులిటెన్ విడుదలకే పరిమితం అయ్యారని చెప్పారు. హైకోర్టు అంటే కూడా ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి కాదు.. కరోనా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తన పార్టీ అధికారంలో ఉంటే… ఆరోగ్య మంత్రిని సంగారెడ్డి ఆసుపత్రిలో పడుకో బెట్టే వాడినన్నారు.