తిరుపతి ఉప ఎన్నిక బరిలో పవన్ !

తిరుపతి ఉప ఎన్నిక బరిలో జనసేన అధినేత, పవర్ స్టార్  పవన్ కల్యాణ్ నిలబడనున్నట్టు తెలుస్తోంది. పవన్ తాజా ఢిల్లీ టూర్ కూడా ఇందుకోసమేనని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలవనున్నారు. GHMC ఎన్నికల్లో వెనక్కి తగ్గినందుకు తిరుపతి సీటు జనసేన కోరుతున్నట్లు సమాచారం.

ఆ విషయంపై బీజేపీ అగ్రనేతలు చర్చలు జరపనున్నారు పవన్ కళ్యాణ్. ఈ చర్చల్లో పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఓట్లు తమకు ఎక్కువగా ఉన్నాయని జనసేన లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఉప ఎన్నిక బరిలో స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ దిగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

Spread the love