మూడు రాజధానులపై జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ మూడు రాజధానుల అంశంపై రేపు కీలక సమావేశం నిర్వహించనుంది. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రతినిధులతో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ రేపు అత్యవసరంగా సమావేశం కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, మూడు రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు.

రాజధాని రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చించనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  ఇక విశాఖ షిప్‌యార్డ్‌ల్ భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందిన ఘటనపై జనసేన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.