ఏపీ మంత్రిపై వెయ్యి కోట్ల అవినీతి ఆరోపణ

జనసేన పీఎసీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ మంత్రి వెల్లంపల్లిపై షాకింగ్ ఆరోపణలు చేశారు. వెల్లంపల్లి రూ.1000కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం చేసారు. విజయవాడ 40 డివిజన్ లో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బోయిన శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భాంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ధరల నియంత్రణ లో సర్కార్ విఫలమైంది అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు,సంక్షేమం లేదు అని అన్నారు. అవినీతి సంపాదన మీద కాకుండా రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టాలి అని సూచించారు. అమ్మఓడి తోనే ప్రజలు పండుగ చేసుకోవాలా.. గతంలో ప్రజలు పండుగ చేసుకోలేదా అని నిలదీశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 1000కోట్ల అవినీతి కి పాల్పడ్డారు అని మండిపడ్డారు.

Spread the love