జనసైనికులకు సడెన్ షాక్

జనసైనికులకి సడెన్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. గ్రేటర్ బరి నుంచి జనసేన తప్పుకుంటుంది. భాజాపాకు మద్దతు ఇస్తుంది. ఇప్పటికే నామినేషన్స్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటారని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ( BJP) అగ్రనేతలు అయిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో ఇవాళ మధ్యహ్నం సమావేశం అయ్యారు పవన్ కల్యాణ్.

ఈ సమావేశం జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నేతలు జనసేన మద్దతు కోరారు. అందుకు పవన్ అంగీకరించారు. జనసైనికులు నామినేషన్స్ విత్ డ్రా చేసుకుంటారని ప్రకటించారు. ఓట్లు చీలిపోకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.