పంచాయతీల్లో తెదేపా ఓటమిపై జేసీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలని అధికార వైసీపీ కైవసం చేసుకుంది. దీనిపై తెదేపా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒకరోజు ఆదాయం రూ. 300 కోట్లని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో వాస్తవం తనకు తెలియదని, ప్రజలు మాత్రం జగన్ సంపాదనపై చర్చించుకుంటున్నారని అన్నారు.

వాస్తవానికి కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంతో బాగా అభివృద్ధి చేశారని, అయినా, వైసీపీ ఇచ్చినంత డబ్బును ఇవ్వలేక ఓడిపోయారన్నారు. అధికార పార్టీ ధన బలానికి పోలీసులు కూడా తోడయ్యారని అన్నారు. అందుకే ఎన్నికల్లో జగన్ బ్యాచ్ అధిక విజయాలు సాధించిందన్నారు. చంద్రబాబు ఎటువంటి వ్యక్తో, జగన్ ఎటువంటి వ్యక్తో ప్రజలకు తెలుసునని జేసీ అన్నారు.

Spread the love