మరిన్ని బాషల్లో జేఈఈ

విద్యార్థులకి గుడ్ న్యూస్. జేఈఈ మెయిన్స్ ని మరిన్ని భాషాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర సర్కార్ తెలిపింది. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జాబ్) వచ్చే ఏడాది నుంచి దేశంలోని మరిన్ని ప్రాంతీయ భాషల్లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ప్రకటించారు.

నూతన జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా మాతృభాష, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్‌ వేదికగా షేర్ చేశారు. వచ్చే ఏడాది నుంచి మరిన్ని ప్రాంతీయ భాషల్లో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావచ్చన్నారు.