అక్కడ సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్

జార్ఖండ్ ప్రభుత్వం సెప్టెంబర్ 30వరకు లాక్‌డౌన్ పొడిగించింది. ఈ టైమ్ లో సాంఘిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపులు, పెద్ద పెద్ద సమ్మేళనాలు సెప్టెంబర్‌ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది.

పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ, కోచింగ్ సంస్థలతో సహా విద్యాసంస్థలు మూసి ఉంటాయి. అంతర్రాష్ట్ర బస్‌ సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని చెప్పింది. జార్ఖండ్ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 34,676కు చేరింది. వైరస్‌తో మొత్తం 378 మంది చనిపోయారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం 10,799 కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 23,499 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.