జియో మరో బిగ్ డీల్

జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ మరో సంచలన ఒప్పందం ఖరారు చేసుకుంది. అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ అండ్ కంపెనీ జియోలో రూ. 11,367 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఆసియాలో కేకేఆర్ సంస్థ పెట్టుబడుల్లో ఇదే.తాజాగా ఒప్పందంతో జియోలో 2.32 శాతం ఈక్విటీ వాటా సదరు సంస్థకు దక్కనుంది.

ఏప్రిల్ 22న 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్.. జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకే సిల్వర్ లేక్ సంస్థ రూ.5,665.75 కోట్లతో జియోలో 1.15 శాతం వాటా తీసుకుంది. ఈ నెల 8న అమెరికాకి చెందిన మరో దిగ్గజ సంస్థ విస్టా ఈక్విటీ పార్టనర్స్ 2.32 శాతం వాటా కోసం రూ.11,367 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఇదే నెల 17న మరో గ్లోబల్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ.6,598.38 కోట్లతో 1.34 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.