జియో మరో భారీ డీల్

 


టెలీకామ్ సంచలనం జియో మరో భారె డీల్ చేసుకొంది. తాజాగా మరో నాలుగు సంస్థలకు కూడా వాటాలను అమ్మింది రిలయన్స్.. దీని ద్వారా రూ.30,062 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది.

జియో ప్లాట్‌ఫామ్స్‌లో 6.13 శాతం వాటాను ఎల్‌ కాట్టెర్టన్, ది పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, సిల్వర్ లేక్, జెనరల్ అట్లాంటిక్ కంపెనీలకు అమ్మినట్టుగా ప్రకటించింది. ఎల్‌ కాట్టెర్టన్ రూ.1894.50 కోట్లు చెల్లించి జియోలొ 0.39 శాతం వాటాను సొంతం చేసుకుంది.

ది పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట ఫండ్ రూ.11,367 కోట్లు చెల్లించి 2.32 వాటాను దక్కించుకుంది. సిల్వర్ లేక్ యూనిట్స్ అయిన ఎస్ఎల్‌పీ రెడ్ వుడ్ హోల్డింగ్స్, ఎస్ఎల్‌పీ రెడ్ వుడ్ కో ఇన్వెస్ట్ (డీఈ) 2.08 శాతం వాటాను పొంది రూ.10,202.55 కోట్లు చెల్లించాయి. ఇక జనరల్ అట్లాంటిక్ సింగపూర్ జేపీ రూ.6598.38 కోట్లకు… 1.34 శాతం వాటా దక్కించుకుంది.

Spread the love