ఆన్ లైన్ డెలవరీ రంగంలోకి జియో


టెలికాం సంచలనం జియో ఇప్పుడు ఆన్ లైన్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టింది. జియో మార్ట్ పేరుతో ఈ సంస్థ ఫ్లిఫ్కార్ట్, అమెజాన్ లకు పోటీగా వచ్చింది. అయితే ఈ ఆప్ ద్వారా కూరగాయలు, పండ్లు , పాలు, కిరాణా సామాన్ ను ఆర్డర్ చేసుకోవచ్చు.

టెలికాం రంగంలో మొదట్లో భారీ ఆపర్లతో మురిపించిన జియో.. ఇప్పుడు ఆన్ లైన్ డెలవరీ రంగంలోనూ.. అదే చేస్తోంది. ఇప్పటి వరకు ముంబయి లో మాత్రమే సేవలు అందించిన జియో మార్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సేవలను ప్రారంభించింది. అయితే 750 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తేనే డెలివరీ ఛార్జ్ ఉండదు. అంతే కాకుండా ఈ సేవలను ఫేస్బుక్, వాట్సప్ లోకి కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.