తెరాసలోకి వలసలు

ఇటీవల కాలంలో ఉమ్మడి నిజాబామాద్ జిల్లాలో తెరాసలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలోని బోధన్ పట్టణానికి చెందిన సీనియర్ కౌన్సిలర్, కాంగ్రెస్ బోధన్ పట్టణం మాజీ అధ్యక్షుడు కామేపల్లి సత్యనారాయణతోపాటు మరి కొందరు కౌన్సిలర్లు హైదరాబాద్ లో బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని చూసే టీఆర్ఎస్ లో చేరుతున్నామని వారు అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. మరోవైపు ఎన్నికల ముందు పసుపుబోర్డ్ తీసుకొస్తానని హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ పై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో తెరాసలోకి వలసలు పెరుగుతున్నాయ్.