చిన్నప్పటి కథ.. నిజమైంది !

అనగనగా ఓ దాహంతో ఉన్న కాకి. దాహంతోనీళ్ల కోసం వెతుకుతోంది. దానికి కుండ కనిపించింది. దానిలో కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయ్. దీంతో ఆ కాకి తెలివిగా రాళ్లని కుండలో వేసింది. దీంతో నీరు పైకొచ్చింది. కాకి దాహాం తీర్చుకుంది అని చిన్నప్పుడు కథ విన్నాం. ఇప్పుడీ కథని ఓ కాకి నిజం చేసింది.

కాకి తరహాలోనే అది కూడా తన దప్పికను తీర్చుకోడానికి ప్రయత్నం చేసింది. రోడ్డుపై నీళ్ల బాటిల్లో రాళ్లు వేసి అడుగున ఉన్న నీటిని పైకి తెచ్చింది. పైకి వచ్చిన నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకున్నది మాగ్పీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజ న్స్ ఆశ్చర్య పోతున్నారు.