కేంద్రంపై కమల్ ఫైర్

పెట్రో ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత 8రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయ్. దీనిపై యూనివర్సల్ హీరో, మక్కల్ నీది మైయమ్ అధినేత కమల్ హాసన్ మండిపడ్డారు. పెట్రోల్, డిజిల్ ధరలను పెంచడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయని కమల్ అన్నారు.

గతంలో ప్రభుత్వం ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్ ధరలు పెంచిందని దాంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని..కానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలోనూ పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తే నిత్యావసర వస్తువుల ధర తగ్గి ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. కేంద్రంపై కమల్ ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశారు.