రేపే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

పలు మార్లు వాయిదా పడిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రేపు ప్రారంభం కానుంది. రేపు ఉదయం 11.30 గంటలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం జరగనుంది. వర్చువల్‌ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.

ఫ్లైఓవర్ ప్రారంభం అయ్యాక మొదటిగా ఆర్ అండ్ బీ మంత్రి శంకర్ నారాయణ, అధికారులు ట్రావెల్ చేయనున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. రూ.15,592 కోట్లతో అంచనాలతో 61 ప్రాజెక్టుల పనులను అధికారులు ప్రారంభించనున్నారు.