కన్నడ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్ !

శాండిల్ వుడ్ డ్రగ్ కేసులో రాగిణి, సంజనాతో పాటు ఆరుగురిని సీసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు జాయిట్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ శుక్రవారం ఉదయం మహిళా సాంత్వన కేంద్రానికి వెళ్లి నటీమణులు రాగిణి, సంజనలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు, ఎప్పటి నుంచి పార్టీలను నిర్వహిస్తున్నారనే వివరాలు సేకరించారు. కొందరు రాజకీయ నాయకుల పుత్రులు మత్తు పదార్థాలను తీసుకొనేవారని రాగిణి, సంజనాలు వెల్లడించినట్లు తెలిసింది. విచారణలో వారు వెల్లడించిన వివరాల మేరకు సదరు రాజకీయ నేతల పుత్రులకు నోటీసులు ఇవ్వాలని సీసీబీ పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టికి ప్రముఖ డ్రగ్స్‌ పెడ్లర్‌గా పేరుంది. ఇతనిని శుక్రవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు.